అల్లీపూర్ 8వ వార్డులో ఎంపీడీవో చిరంజీవి ఆకస్మిక తనిఖీ.

తేది: 8-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) చిరంజీవి అల్లీపూర్ గ్రామంలో 8వ వార్డులో ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించి, ప్రజలకు పొడి చెత్త మరియు తడి చెత్త వేరు చేయడంపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
ఇంటి వద్దే చెత్తను వేరు చేయడం వల్ల గ్రామ పారిశుధ్యం మెరుగుపడుతుందని, వ్యాధులు దరిచేరవని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గౌతమి – వెంకటేష్, ఇన్ఛార్జ్ గ్రామ కార్యదర్శి శ్రీహరి, 8వ వార్డు సభ్యులు అనుమల్ల రాజ్ కుమార్, కారోబార్ రాజేందర్ పాల్గొన్నారు. పారిశుధ్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ కవిత, గ్రామస్థులు మాజీ సింగిల్ విండో చైర్మన్ యాదవనేని రాజలింగం అనుమల్ల మల్లేశం, పొట్టవత్తిని నాగభూషణం మరియు 8వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *