తేది:07-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం భాగంగా రాయికల్ మున్సిపాలిటీ లో మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బి. రాజా గౌడ్ కార్యక్రమం అమలు విధానం పై మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్ కు అదనపు కలెక్టర్ రాజా గౌడ్ శాలువాతో సన్మానించారు.
అనంతరం అదనపు కలెక్టర్ రాజా గౌడ్ , మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్ , మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మరియు మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలను నేరుగా కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే పట్టణంలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి రోడ్ల శుభ్రపరిచే పనులు, డ్రైనేజీల శుభ్రత కార్యక్రమాలను మున్సిపల్ శానిటేషన్ కార్మికులతో చేపట్టించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడమే ఈ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాయికల్ పట్టణ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం మున్సిపాలిటీ ఎల్లప్పుడూ ముందుండి పని చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్ , మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్ , మున్సిపల్ కమిషనర్ నాగరాజు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మరియు ఇతర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.