తేది:07-3-2026 TSLAWSNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.
సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌లో గల సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం శనివారం (07 మార్చి 2026) ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమం ప్రారంభంలో 9వ తరగతి విద్యార్థిని ఎ. నక్షత్ర స్వాగతనృత్యగీతంతో అతిథులను ఆహ్వానించారు. అనంతరం విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీ ఈ. విజయ్ కుమార్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ మరియు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఈ. అరుణా రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ శ్రీ ఈ. జయబాల రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రదీప్ లక్కి శెట్టి కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీ ఈ. విజయ్ కుమార్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, “విద్య యొక్క వేర్లు చేదుగా ఉన్నా, దాని ఫలాలు తియ్యగా ఉంటాయి” అని పేర్కొన్నారు. విద్యార్థులు కఠినంగా అభ్యసించి పొందిన విద్యను సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగిస్తూ, మంచి నైతిక విలువలతో జీవితంలో తమ కాళ్లపై తామే నిలబడి ఘనవిజయాలు సాధించాలని సూచించారు. అలాగే తమ శక్తి సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటూ, ఇతరుల వద్ద ఉన్న మంచి లక్షణాలను నేర్చుకుని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు.
తదనంతరం 9వ మరియు 10వ తరగతి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు చిరు జ్ఞాపికలను అందజేసి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమం సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ శ్రీ ఈ. సలోమోన్ రెడ్డి గారి ఆశీస్సులతో నిర్వహించబడింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం నయనానందకరంగా సాగింది.