తేది:7-03-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.
విద్యార్థులకు నాణ్యమైన విద్య – మంచి ఫలితాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి- జిల్లా కలెక్టర్ పి .ప్రావీణ్య.
సంగారెడ్డి జిల్లా: ఐదు నెలల శిక్షణలో పొందిన నైపుణ్యాలను ఆసరాగా చేసుకుని ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలని జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య అన్నారు. శనివారం సంగారెడ్డి లోని బీసీ స్టడీ సర్కిల్ లో సివిల్స్, గ్రూప్స్, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్ పరీక్షలకు శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు తన నిధులతో ఉచితంగా స్టడీ మెటీరియల్ ను కలెక్టర్ అందజేశారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నోటిఫికేషన్లు ఇప్పుడు వస్తాయో తెలియదు ,కాబట్టి విద్యార్థులు శిక్షణలో పొందిన జ్ఞానానికి అదనపు జ్ఞాన సముపార్జన కోసం స్టడీ మెటీరియల్ దోహదం చేస్తుందన్నారు. తమ సమయాన్ని వృధా చేయకుండా నోటిఫికేషన్ వచ్చిన ప్రతి పరీక్ష కు హాజరై తమ జ్ఞానాన్ని పెంపొందించుకొని తమ లక్ష్యాలను చేరుకోవాలని ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సూచించారు.
జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలకు అనుగుణంగా నాణ్యమైన విద్య, వృత్తి ఆధారిత విద్య అందించాలి,కేంద్ర నోడల్ అధికారి అమన్ శర్మ అన్నారు .
సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయ సమావేశమందిరంలో పీఎం శ్రీ పాఠశాలల అమలు పురోగతి పై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర నోడల్ అధికారి అమన్ శర్మ, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య , జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు , పి ఏం శ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర నోడల్ అధికారి అమన్ శర్మ మాట్లాడుతూ, జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలకు అనుగుణంగా నాణ్యమైన విద్య, వృత్తి ఆధారిత విద్య మరియు జీవిత నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమని కేంద్ర నోడల్ అధికారి పేర్కొన్నారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం శ్రీ పథకం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. అయితే విద్యార్థుల నేర్చుకునే స్థాయిలు ,విద్యా ఫలితాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా 10వ, 12వ తరగతి విద్యార్థుల ఫలితాలు మెరుగుపడేలా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో 44 ప్రాథమిక పాఠశాలలు , ఉన్నత పాఠశాలలు మోడల్ స్కూల్స్ లలో పీఎం శ్రీ పథకం అమలు, అమలుచేయడం జరుగుతుందని , పీఎం శ్రీ పథకం అమలు, బడ్జెట్ వినియోగం, విద్యా కార్యక్రమాలు , మౌలిక వసతుల పురోగతి ని కేంద్ర నోడల్ అధికారికి , జిల్లా కలెక్టర్ కి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు వివరించారు . పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం మరియు అనుభవాత్మక అభ్యాసం పెరుగుతున్నట్లు తెలిపారు. టెలిస్కోపులు, డ్రోన్లు వంటి ఆధునిక పరికరాల వినియోగంతో విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు కలుగుతున్నాయని డి ఇ ఓ వెల్లడించారు. ఈ బడ్జెట్ వినియోగం, విద్యా కార్యక్రమాలు పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధిపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం మరియు అనుభవాత్మక అభ్యాసం పెంపొందుతోందని వివరించారు. టెలిస్కోపులు, డ్రోన్లు వంటి ఆధునిక పరికరాల వినియోగంతో విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు కలుగుతున్నాయని తెలిపారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో గ్రీవెన్స్ బాక్స్‌లు ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
అయితే పీఎం శ్రీ పథకం నిధులు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విడుదల చేస్తే పాఠశాలలు కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయడం సాధ్యమౌతుందని ఉపాధ్యాయులు అధికారులు సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్, రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం డిప్యూటీ డైరెక్టర్ జనార్దన్ రావు, స్టేట్ అకాడమిక్ మానిటరింగ్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ జావిద్, సమగ్ర శిక్ష సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్లు బాలయ్య, వెంకటేశం, సునీత, కన్నా, తాజుద్దీన్, మాధవి తదితరులు మరియు పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.