టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న వారిలో నటుడు ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయి షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ అద్భుతమైన నటన అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు కూడా అభిమానులుగా ఉన్నారని చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ (Prashanth Neel)డైరెక్షన్ లో ఓ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ..
ప్రస్తుతం ఈ సినిమా డ్రాగన్(Dragon) అనే టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది కానీ ఈ సినిమాకు ఈ టైటిల్ పిక్స్ కాదని త్వరలోనే ఒక కొత్త టైటిల్ ప్రకటించబోతున్నారని నిర్మాతలు తెలియజేశారు. ప్రస్తుత ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారు అయితే ఈ సినిమాలో మరొక సీనియర్ స్టార్ హీరోయిన్ కూడా భాగమవుతున్నారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో కుష్బూ..
దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి కుష్బూ సుందర్ (Kushbu Sundar )ఒకరు. రజనీకాంత్, కమల్ హాసన్ చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె ఈ తరం హీరోలలో ఎన్టీఆర్ కు వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే. పలు సందర్భాలలో ఎన్టీఆర్ నటన గురించి ఆయన డాన్స్ గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ కు తాను పెద్ద అభిమానిని ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే వదులుకోనని తెలిపారు.
కుష్బూ కోరిక నెరవేరబోతుందా…
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోతున్న డ్రాగన్ సినిమాలో కుష్బూ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందనే వార్తలు వైరల్ అయ్యాయి . ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ సినిమా కోసం పనిచేయాలనే నటి కుష్బూ కోరిక కూడా నెరవేరబోతోంది అంటూ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి కుష్బూ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ భాగమైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జోడిగా రుక్మిణి వసంత్ ఈ సినిమాలో సందడి చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఏ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.