అసెంబ్లీలో వైసీపీ గుట్టు రట్టు..! అంతా బయటపెట్టిన డిప్యూటీ సీఎం పవన్..

అసెంబ్లీ వేదికగా వైసీపీ గుట్టు రట్టు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగందని కుండబద్దలు కొట్టేశారు. దీని కారణంగా రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేసిన పనుల వల్ల 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు. వారు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో ఆ విషయాలను బయట పెట్టారు.

 

అసెంబ్లీలో వైసీపీ గుట్టు రట్టు చేసిన డిప్యూటీ సీఎం

 

శుక్రవారం ఉదయం ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందని, సీఎం చంద్రబాబు దూరదృష్టి, దక్షత, దార్శనికత ఈ బడ్జెట్‌లో స్పష్టంగా కనిపించాయన్నారు. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు.

 

వైసీపీ ప్రభుత్వం తమపై దాదాపు రూ. 9 లక్షల కోట్ల మేరా అప్పులు ఉంచి వెళ్లిందన్నారు పవన్ కల్యాణ్. అంతేకాదు 35 వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్‌లో పెట్టిందన్నారు. 25 వేల కోట్లు చెల్లించామని వెల్లడించారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వాటా ఇవ్వక పోవటం వల్ల రూ.8,700 కోట్లు జల జీవన్ మిషన్ నిధులు నిరుపయోగం అయ్యాయని తెలిపారు.

 

వైసీపీ రాజకీయాలు చేస్తున్నారో ఆ విషయాలు బయటకు

 

పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన అనేక ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వంలో ప్రారంభించామన్నారు. రాష్ట్రం కోసం 15 ఏళ్లపాటు కూటమి ఉండాలని మరోసారి స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. దానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. ఇదే సమయంలో వైసీపీ నేతల వ్యాఖ్యలను సభలో వివరించారు. ఇష్టం వచ్చినట్లు తిట్టేసి కులాల వెనక దాక్కుంటున్నారని వ్యాఖ్యానించారు.

 

ఇలాంటి ధోరణి ఇకపై కొనసాగిస్తే కుదరదని తేల్చేశారు. ఇదే కంటిన్యూ అయితే ఏపీ ప్రజలు నష్టపోతారని తేల్చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలు ధాటకపోతే రాష్ట్ర ప్రయోజనాలు సాధించలేమని స్పష్టం చేశారు. ఐక్యంగా ఉండాలని మనం కోరుకుంటే.. విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దీన్ని రిపీట్ గా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

 

ప్రతిపక్షం 11 మంది సభ్యులున్నప్పటికీ 1100 మంది ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. వాళ్లు చెప్పిన విషయాలను ప్రజలు బలంగా నమ్ముతారని, మనం చేసిన పనులు చెప్పుకోలేక పోతున్నామని తెలిపారు. మన మధ్య ఏకాభిప్రాయం ఉండాలన్నారు. వాళ్ల సమూహాన్ని ఎదుర్కోవాలంటే మనలో ఎలాంటి గొడవలు ఉండకూడదని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *