తేది:5-03-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా : కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ గృహాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తోందని తెలిపారు. ఈ పథకం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందుతుందని అన్నారు.
జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ అవగాహన వాహనం జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ ప్రజలకు పథకం వివరాలు తెలియజేయనుంది.సంబంధిత శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.