మైనర్ పై అఘాయిత్యం. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష.

తేది:04-03-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: 2022లో నమోదైన మైనర్ బాలికపై అత్యాచారం పోలీస్ కేసులో కోర్టు తీర్పు వెలువడినట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. మల్యాల పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద నమోదు చేసిన ఈ కేసులో మండలంలోని రాంపూర్ కు చెందిన నిందితుడు మహమ్మద్ రజాక్ (50)కి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15,000 జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని JGTL ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి రత్న పద్మ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *