సైనైడ్ కంటే ప్రమాదకరం గడ్డి మందుపారా క్వాట్‌ను వెంటనే బ్యాన్ చేయాలిగడ్డి మందు నిషేధంపై కేంద్ర మంత్రులను కలుస్తా గడ్డి మందు రద్దు వరకూ నా పోరాటం కొనసాగిస్తా ఐఎంఏ సదస్సులో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య.

తేది:03-03-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా: ప్రాణాంతకమైన గడ్డి మందు (PARAQUAT)ను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తూ Indian Medical Association (ఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.హైదరాబాద్, కోటిలోని ఐఎంఏ కార్యాలయంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిషన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వైద్యులు హాజరయ్యారు. గడ్డి మందు (పారా క్వాట్) వల్ల జరుగుతున్న మరణాలు, భూమి సారంపై పడుతున్న దుష్ప్రభావాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ,గడ్డి మందు సైనైడ్ కంటే ప్రమాదకరం అని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. ఇది రైతులకు మాత్రమే కాకుండా రానున్న తరాలకు కూడా ముప్పుగా మారిందని పేర్కొన్నారు.. గడ్డి మందు భూమి సారాన్ని నాశనం చేస్తోంది. ప్రజలకు తెలియక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు” అని రెండు మూడు చుక్కలు శరీరంలోకి వెళ్తేనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గడ్డి మందును పూర్తిగా నిషేధించే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ విషయమై అన్ని రాజకీయ పార్టీల ఎంపీలతో కలిసి ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసి, వారి సంతకాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేస్తానని తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులను కలిసి గడ్డి మందును నిషేధించేలా ఒత్తిడి తీసుకొస్తానని స్పష్టం చేశారు.ఇంతకుముందు వరంగల్‌కు సీజీహెచ్‌ఎస్ వెల్నెస్ సెంటర్ మంజూరు చేయించేందుకు ఎంపీల సంతకాలతో కేంద్రాన్ని ఒప్పించగలిగామని గుర్తు చేసిన ఎంపీ డా.కడియం కావ్య, అదే తరహాలో ఇప్పుడు గడ్డి మందు నిషేధం కోసం కూడా పోరాటం చేస్తానన్నారు. కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులపై ‘ఐఎంఏ సర్టిఫైడ్’ అని ప్రచారం చేస్తున్నాయని, వాస్తవానికి ఐఎంఏ ఈ మందును వ్యతిరేకిస్తోందన్న విషయం ప్రతి రైతుకు, ప్రతి గ్రామానికి చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీ సూచించారు. గడ్డి మందును వెంటనే నిషేధించాలని, రైతులకు ప్రత్యామ్నాయ సురక్షిత పద్ధతులు సూచించాలని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సదస్సు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు.
ఈ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వినోద్, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, డాక్టర్ అశోక్, ద్వారకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *