చేగుంట మండల మున్సిపల్ కార్మికుల వినతి – గృహ స్థలాల మంజూరుకు కలెక్టర్‌కు విజ్ఞప్తి.

తేది:02-03-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .

మెదక్ జిల్లా: చేగుంట మండలానికి చెందిన మున్సిపల్ కార్మికులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ IAS గారికి వినతిపత్రం సమర్పించారు.
ఇళ్ల అద్దెలు అధికంగా ఉండటంతో వాటిని చెల్లించడం కష్టంగా మారిందని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వేతనాలతో జీవనం సాగించడం భారంగా మారిందని, కుటుంబాలను పోషించడంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో కబ్జాకు గురయిన ప్రభుత్వ భూమిలో తమకు ఇంటి ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం తమకు గృహ స్థలాలు మంజూరు చేయాలని వారు కోరారు,స్థిర నివాసం ఉంటే తమ కుటుంబాలకు భద్రత కలుగుతుందని, జీవనోపాధి మెరుగుపడుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గణేష్, నవీన్, పి. వెంకటేశం, స్వామి, ఎస్. కృష్ణ, ఎర్ర బలయ్య, సాయమ్మ, లలిత, సువర్ణ, మాణెమ్మ, శ్రీకాంత్, జ్యోతి, ఆంజనేయులు, భూదయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల వినతిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *