తేది:28-02-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రాయికల్ మండలం రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో శనివారం రోజున శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం పండితులు కల్యాణాచార్యులు రామకృష్ణచార్యులు, కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి తులాభారం నిర్వహించారు..గ్రామ ప్రజల సౌజన్యంతో భక్తులందరికీ మహా అన్నదానం నిర్వహించారు.
స్వామివారి కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవల్లి సేవా సమితి 15 మంది సభ్యులు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో నిరటి సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాగిరెడ్డి సాయిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మల్లారెడ్డి, రఘునాథ్, వేణు, శ్రీనివాస్, చిన్న లింబాద్రి , లక్ష్మయ్య, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.