వరంగల్‌లో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య.

తేది :27-02-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా: వరంగల్ నగరంలో నిర్మాణంలో ఉన్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సత్య శారద గారితో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధి పనులపై MGM సూపరింటెండెంట్, ఎల్ & టీ అధికారులు, ఆర్ & బీ, విద్యుత్ శాఖ, జీడబ్ల్యూఎంసీ, ఫైర్ శాఖ అధికారులతో ఎంపీ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆసుపత్రి నిర్మాణ పురోగతిని అధికారులు ఎంపీకి వివరించారు.ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారని తెలిపారు. త్వరలో పనులు పూర్తి చేసి, ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని, రోగులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.ఉత్తర తెలంగాణ ప్రజల వైద్య అవసరాల కోసం నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలోనే అందుబాటులోకి రానుందని తెలిపారు. ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలిచే ఈ ఆసుపత్రి ద్వారా వరంగల్‌తో పాటు పలు జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో భవన నిర్మాణ పనులుకొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. త్వరలోనే ఓపీ, ఐపీ వైద్య సేవలు అందుబాటులోకిరానున్నాయని వెల్లడించారు. ఆసుపత్రికి సరిపడ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ సిబ్బంది సేవలందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్వయంగా 24 అంతస్తుల భవనంలోని అన్ని ఫ్లోర్‌లలో తిరిగి జరుగుతున్న పనులను పరిశీలించారు.ప్రధానంగా ఎమర్జెన్సీ సేవలు, 16 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్న బెడ్లకు ఆక్సిజన్ లైన్లు, ఫైర్ సేఫ్టీ వ్యవస్థ, సెంట్రల్ ఏసీ లైన్, విద్యుత్ సరఫరా, నీటి పైప్‌లైన్ కనెక్షన్లు, క్యాన్సర్ విభాగానికి రేడియేషన్ థెరపీ కోసం ప్రత్యేక బంకర్లు, ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ సేవలు, ఆడిటోరియం, ఆపరేషన్ థియేటర్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ఉత్తర తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ స్థాయి వైద్య సేవలు వరంగల్‌లోనే అందుబాటులోకి రానున్నాయని ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్&బి SE రాఘవరెడ్డి, ఆర్ & బి EE రాజేందర్, L&T ప్రాజెక్టు మేనేజర్ శ్రవణ్ కుమార్, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్ హరీశ్ చంద్రారెడ్డి, RMO అశ్విన్ కుమార్, జిల్లా ఫైర్ అధికారి శ్రీధర్ రెడ్డి, NPDCL – SE గీతం రెడ్డి, ఆర్ & బి E E ఎలక్ట్రికల్ నర్సయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మున్సిపల్ కార్పొరేషన్ రవికుమార్, MRO శ్రీకాంత్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *