తేది:26-02-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS రాయికల్ మండలం రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.
జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం రామాజీపేట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. మల్లాపూర్ మండలం గుండంపెల్లికి చెందిన పుల్లూరి మధు తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కృష్ణవేణి ప్రైవేట్ పాఠశాల బస్సు ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మధు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.