తేది:22-02-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా: ములుగు జిల్లాలోని తుపాకుల గూడెం జే చోక్కారావు దేవాదుల ప్రాజెక్టు సందర్శన, పనుల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ని, మరియు రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణాల శాఖ,&ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి వర్యులు శ్రీ నల్ల మాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు ధనసరి అనసూయ (సీతక్క) , వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య తో పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కి అధికారులు ప్రాజెక్టుల పురోగతిపై వివరించగా సీఎం మాట్లాడుతూ జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం (JCRDLIS)లో భాగంగా భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు 600 కోట్లు రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలలోపు అన్ని అంచనాలను ప్రభుత్వం ముందుంచి ఆమోదం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.దేవాదుల పంప్ హౌస్‌ను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల రోజుల్లోపు దేవాదుల పంప్ మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మార్చిలో మంత్రివర్గ సమావేశంలో అన్ని అంచనాలకు ఆమోదం తెలియజేస్తామని చెప్పారు. శాసనసభ సమావేశాల సమయంలో దేవాదుల ఎత్తిపోతల పథకంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో కమిటీ హాలులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. భూములు కోల్పోయిన వారికి పరిహారం గ్రీన్ ఛానెల్ లో నిధులు మంజూరు చేస్తామని, భూ సేకరణ జాప్యం వల్ల ప్రాజెక్టుల పనులు ఆగడానికి వీలు లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.