తేది:21-02-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా : బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ ఆలయ నిర్మాణం కోసం సహకారం అందిస్తా ఎమ్మెల్యే నాగరాజు.సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతిని,పురస్కరించుకొని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రోళ్ళకల్ చెరువుముందు తండా లో నిర్వహించిన సంత్ శ్రీ సేవా లాల్ మహారాజ్ జయంతి ముగింపు ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు.అనంతరం సంత్ శ్రీ సేవా మహారాజ్ గుడి నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.అదే విధంగా పర్వతగిరి మండల పరిధిలోని సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ. సంత్ సేవాలాల్ మహారాజ్ తన జీవితాంతం నిత్యం బంజారాల కోసమే పనిచేస్తూ వారి సంక్షేమానికి, హక్కుల సాధనకు కృషి చేశారని, లంబాడా సోదరులు భూమిని సేద్యం చేసుకుంటా భూమిపై ఆధారపడి బతుకుతారని, లంబాడ కులస్తుల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని, గతంలో ఇందిరాగాంధీ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని గుర్తు చేశారు. గిరిజన సోదర, సోదరీమణుల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయిందని, వర్ధన్నపేట ఎమ్మెల్యేగా నా గెలుపులో లంబాడ సోదరులది కీలకపాత్ర అని, మొన్న జరిగిన వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లోను తండాల్లోని మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులని ప్రజలు గెలిపించారని అన్నారు. కొంత సేవాలాల్ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర, గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు చాటిచెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, వారు చూపిన బాటలో నడుస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సేవాలాల్ మందిరం ఏర్పాటు కోసం భూమి, మందిరాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన దాతలను వర్ధన్నపేట ఎమ్మెల్యే అభినందించారు. చదువు మన తలరాతను మారుస్తుందని, విద్యార్థులు చిన్ననాటి నుంచే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, లంబాడ సోదరులకు అనునిత్యం అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, లంబాడ సోదరులకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దేవి మంగ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, సర్పంచులు తొర్రి పద్మ, గాడుదల రవి స్థానిక నాయకులు గిరిజన సోదర సోదరీమణులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.