గ్రామీణ స్థాయి నుంచే అంతర్జాతీయ ఛాంపియన్లుగా తయారు చేయడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం : వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య.

తేది: 20-02-2026, హన్మకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా : హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్–రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలను స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ.గ్రామీణ ప్రాంతాల నుంచే క్రీడా ప్రతిభను వెలికితీసి, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే విధంగా క్రీడాకారులను తయారు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. 2036 ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు సాధించే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు. అథ్లెటిక్స్ విభాగాన్ని హనుమకొండకు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. క్రీడలకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని, విద్యతోపాటు క్రీడలు కూడా అవసరమన్నారు. ఆటల్లో గెలుపు–ఓటములు సహజమని, ఆటల్లో పాల్గొనడమే ఒక విజయం అనే భావనతో ముందుకు సాగాలని సూచించారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుందని, మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ రెండూ అత్యంత ముఖ్యమని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి క్రీడలు కీలకమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎమ్మెల్యే కృషితో సింథటిక్ ట్రాక్, బాక్సింగ్ స్టేడియం వంటి సదుపాయాలు పూర్తయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా మౌలిక వసతులు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి అశోక్, జనరల్ సెక్రటరీ సారంగపాణి, వైస్ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి, SGF సెక్రెటరీ ప్రతాప్, పిఈటి అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, ఏసీపీ నరసింహారావు, ఇతర క్రీడా అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *