తేది:19-02-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. రైడర్స్ యూత్ అధ్యక్షులు ఎర్రవేణి రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, ఆయన చేసిన పోరాటాలను, ధైర్యసాహసాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గురులింగు వినయ్ కుమార్, 8వ వార్డు సభ్యులు అనుమల్ల రాజ్ కుమార్, కొండపలుకుల రత్నాకర్ రావు, రాచమడుగు సాగర్ రావు, సంజీవ్, ఎర్రవేణి లక్ష్మణ్, దాసరపు వేణు రావు, ఆదర్శ గౌడ్, అత్తినేని నాగరాజు, డీజే హరీష్ యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.