తేది:19-02-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్: సిటీ సివిల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తికి బెదిరింపు ఈమెయిల్ పంపిన ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈమెయిల్.
కోర్టు వద్ద ఆర్డీఎక్స్ అమర్చినట్లు, జడ్జి కుర్చీ క్రింద పేలుడు పదార్థాలు పెట్టినట్లు పేర్కొన్నట్టు తెలుస్తోంది.
అదేవిధంగా కోర్టు ప్రాంగణంలో ఇప్పటికే పేలుడు పదార్థాలు అమర్చామని, ఎప్పుడైనా పేల్చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం.
ఈ బెదిరింపు మెయిల్‌పై కోర్టు అధికారుల ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
నిందితుడిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం సహా ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి.
కోర్టు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, సందర్శకుల తనిఖీలు కఠినతరం చేశారు.
పోలీసులు ఈమెయిల్ మూలాన్ని గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.