తేది:19-02-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: మల్యాల మండల కేంద్రంలోని తూర్పువాడ నుంచి గుడిపేట వరకు రోడ్డు నిర్మాణానికి ఏడాది క్రితం శంకుస్థాపన చేయగా ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 2024లో సుమారు రూ. కోటి 35 లక్షల CRR నిధులతో ప్రస్తుత ఎమ్మెల్యే సత్యం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ పనులు ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో మట్టి రోడ్డు పూర్తిగా గుంతల మాయమై రాకపోకలకు ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.