తేది:19-02-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన మల్యాల బాలయ్య యాదవ్ చెట్టు పై నుండి ప్రమాదవశాత్తు జారీ పడిపోగా మెదడు మరియు వెన్నుపూసకు బలమైన గాయం కాగా చికిత్స చేసుకొనే ఆర్థిక స్తోమత లేక స్తానిక నాయకులు మాజీ కో ఆప్షన్ యం.ఏ. మోఖీద్.నాయకులు అజిత్ రావు విషయాన్నీ ఎమ్మేల్యే సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మేల్యే మెరుగైన చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా నిమ్స్ ఆసుపత్రిలో 2 లక్షల రూపాయల LOC బాలయ్య కుటుంబానికి ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భంగా బాలయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోఖీద్, అజిత్ రావు, స్పందన సాగర్ రావు, దొబ్బల వేణు,తదితరులు పాల్గొన్నారు.