కేతకి సంగమేశ్వర దేవస్థానము ఘనంగా శివరాత్రి మహోత్సవాలు.

తేది:15-02-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.

సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండలంలోని ప్రసిద్ధిగాంచిన కేతకి సంగమేశ్వర దేవస్థానం లోని శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నెల 15 వ తారీఖున మహా శివరాత్రి. హిందువులకు పరమపవిత్రమైన ఈ మహా పర్వదినాన లింగాకారుడైన ఆ పరమశివుని దివానుగ్రహం మనందరిపై కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజు ఉపవాస, జాగరణలతో ఎంతో నిష్టగా ఆ శివయ్యను భక్తులు ప్రార్థిస్తారు.ఇది శివుడు మరియు పార్వతిల వివాహ రాత్రి, శివుని విశ్వ నృత్యం (తాండవం) రాత్రి లేదా శివలింగం కనిపించిన రాత్రిని గుర్తుచేస్తుంది.
ఆచారాలు: భక్తులు ఉపవాసం ఉంటారు, ధ్యానం చేస్తారు, “ఓం నమః శివాయ” వంటి మంత్రాలను జపిస్తారు మరియు రాత్రంతా ప్రార్థనలు చేస్తారు.
ఆచారాలు: ఒక ముఖ్యమైన ఆచారంలో పాలు, నీరు, తేనె లేదా పెరుగుతో అభిషేకం (శివలింగానికి స్నానం చేయడం) ఉంటుంది.ఇది ఆత్మపరిశీలన, అంతర్గత పరివర్తన మరియు దైవంతో అనుసంధానం కావడానికి ఒక సమయం. వివిధ పురాణాలు మహా శివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి. శైవ సంప్రదాయంలో ఒక పురాణం ప్రకారం, సృష్టి, స్థితి, లయ కారకుడైన శివుడు తాండవం చేసే రాత్రి ఇది. స్తోత్రాలు, శైవ గ్రంథాల పఠనం, భక్తుల హోరు ఈ విశ్వ నృత్యంలో చేరి, ప్రతిచోటా శివుని ఉనికిని గుర్తు చేస్తుంది. మరొక పురాణం ప్రకారం, ఇది శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రాత్రి.[1][5] వేరొక పురాణం ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికొకసారి శివలింగాన్ని పూజించడం, గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి, పుణ్యమార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడం.[1] క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్నుంచి ప్రపంచాన్ని కాపాడటం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకుని నీలకంఠుడనే పేరు పొందిన రాత్రి ఇది. మండల లో వేద ప్రాంతాల నుంచి కాక పక్క రాష్ట్రాల నుంచి భక్తులు అనేకమంది రావడంతో కేతగి సంగమేశ్వర దేవస్థానం కిక్కిరిసిపోయింది. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వారు పాదయాత్రతో జంగమహేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడంతో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *