పుల్వామా అమరులకు ఘన నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తు ర్యాలీలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య.

తేది:14-02-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది CRPF జవాన్లను స్మరించుకుంటూ ఫిబ్రవరి 14ను ‘బ్లాక్ డే’గా పాటించారు. మాజీ కేంద్ర సాయుధ పోలీస్ బలగాల సంక్షేమ సంఘం (EXCAPFWA) ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.
హనుమకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిగ్నల్ పాయింట్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీ లో పాల్గొని అమరవీరులకు ఎంపీ నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల త్యాగం, దేశభక్తి ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు.
కొవ్వొత్తుల వెలుగుతో అమరుల జ్ఞాపకాలను స్మరించుకుంటూ, వారి అజేయ ఆత్మస్థైర్యానికి వందనం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు G సురేందర్ నాథ్, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్, వైస్ ప్రెసిడెంట్. నారాయణ చారి, జనరల్ సెక్రెటరీ, ఎలిగేటి శ్రీనివాస్, కోశాధికారి కిషోర్ జి, CAPF సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *