తేది:14-02- 2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా:ఝరాసంగం మండలంలోని మజ్నుర్ గ్రామ శివారులలో నిర్వహించిన పాత పంటల జాతర ముగింపు సభలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అంటేనే చిరుధాన్యాల ప్రయోగశాల అని రాష్ట్ర రైతు సంక్షేమ చైర్మన్ కమిషన్ అని కోదండ రెడ్డి మాట్లాడారు. 26వ పాత పంటల జాతర ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నీటి కాలంలో మహిళలు ఇలాంటి చిరుధాన్యాల వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఈనాటికి ఈ సొసైటీలో చిరుధాన్యాల ప్రాధాన్యత ఉందని తెలిపారు. రసాయనిక ఎరువులు అధిక మోతాదులో వాడడం వల్ల మనం తీసుకునే ఆహారం కూడా నాణ్యతను కోల్పోయి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఫలితంగా ప్రతి రైతు తమ వ్యవసాయ భూమిలో పాత పద్ధతులను వినియోగించి పంటలు పండించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ విధంగా రైతులకు పాత పద్ధతిలో పంటలు పండించే విధంగా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి అని పేర్కొనడం జరిగింది. కార్యక్రమంలో తహసిల్దార్ భాస్కర్, సర్పంచ్ మాధవి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ బిక్షపతి, సంధ్యారాణి, గోపాల్, నందకిషోర్, రామ్ రెడ్డి, నరసింహారెడ్డి, రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.