తేది:14-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం.మెదక్ మున్సిపల్ కార్యాలయంలో నేడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు విజయం సాధించినందుకు రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా గెలుపు ధృవపత్రాలు అందుకున్నారు.
విజేతలు పద్మ దేవేందర్ రెడ్డి అద్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. భారీ కాన్వాయ్‌తో వచ్చిన వారిని పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షధ్వానాలతో స్వాగతించారు. మున్సిపల్ కార్యాలయం సందడిగా మారింది.
అదేవిధంగా 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మామిళ్ల అంజనేయులు పోలింగ్ ఫలితాల రోజునే తన గెలుపు ధృవపత్రాన్ని స్వీకరించారు
ఇక మెదక్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది. అధికార పీఠం ఎవరి దక్కనుందన్న చర్చ పట్టణంలో జోరుగా సాగుతోంది.