ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికలు-314 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా వలయం.

తేది :10-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.

సంగారెడ్డి జిల్లా: ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఇస్నాపూర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొత్తం 314 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల భద్రతా విధుల్లో పాల్గొంటారని వివరించారు. ఇందులో ఇద్దరు డీసీపీలు, ఇద్దరు ఏసీపీలు, తొమ్మిది మంది సీఐలు, 24 మంది ఎస్‌ఐలు మరియు ఇతర సిబ్బంది ఉంటారని తెలిపారు.
ఈ సమావేశంలో శేర్లింగంపల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్, పట్టంచేరు ఎస్‌హెచ్‌ఓ వినాయక్ రెడ్డి, డీఐ రాజు, సీఐలు, ఎస్‌ఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *