ఉద్యోగుల పదవీ కాలాన్ని పెంచడం లేదు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని, గడువు పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. పదవీ విరమణ వయస్సు ముగిసిన వారు నిబంధనల మేరకు మార్చి 31వ తేదీన రిటైర్‌ కావాల్సిందేనని తెలిపింది. దేశవ్యాప్తంగా నెలకొన్న అసాధారణ పరిస్థితులున్నప్పటికీ ఉద్యోగుల పదవీ కాలాన్ని పెంచడం లేదని సిబ్బంది శాఖ వివరించింది. లాక్ డౌన్ కారణంగా వారు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నా లేదా కార్యాలయానికి హాజరవుతున్నా నిబంధన –56 ప్రకారం మార్చి 31, 2020న రిటైర్‌ కావాల్సిందేనని పేర్కొంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *