తేది:31-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి.ప్రసాద్ గౌడ్.
సంగారెడ్డి జిల్లా :సదాశివపేట మండలంలోని తంగడపల్లి గ్రామం శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం, శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం, జంగమయ్య గుట్ట 30 వ వార్షికోత్సవ జాతర మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఈరోజు వీరశైవ సమాజం చౌకీమఠం సభ్యులకి ఆశ్రమ పక్షాన జంగం మహేష్ స్వామి అందజేశారు.
ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 8 వరకు సప్తాహము నిత్య చండీ హవనము దేవీ భాగవత పురాణము సామూహిక హనుమాన్ చాలీసా, అయ్యాచార దీక్షలు, గండజ్యోతి , పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
వీరశైవ సమాజం చౌకీమఠం ప్రధాన కార్యదర్శి పిల్లోడి విశ్వనాథం మాట్లాడుతూ తంగడపల్లి జంగమయ్య గుట్టలో నిర్వహిస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మన సమాజ సభ్యులే కాకుండా సమస్త భక్తులు కూడా పాల్గొని జాతర ఉత్సవాలను విజయవంతం చేస్తూ ఫిబ్రవరి 8న నిర్వహించబడుతున్న పార్వతి పరమేశ్వర కళ్యాణం ఉత్సవానికి అధిక సంఖ్యలో పాల్గొని ఆదిదంపతుల కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి పులిమామిడి వీరేశం, చందు స్వామి, తుమ్మలపల్లి శంకర్, సంగమేశ్వర్, ఆంజనేయులు, నాగిశెట్టి, తదితరులు పాల్గొన్నారు.