39 ఏళ్ల సేవలకు అభినందనలు,హెడ్ కానిస్టేబుల్ రాంచంద్రారెడ్డి గారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు.

తేది:31-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: ఉద్యోగ జీవితం లో పదవి విరమణ సహజమే కానీ సేవలతో సంపాదించిన గౌరవం శాశ్వతం.
39 సంవత్సరాల పాటు పోలీస్ విభాగంలో నిబద్ధత, క్రమశిక్షణ, బాధ్యతతో విధులు నిర్వర్తించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీ రాంచంద్రారెడ్డి గారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
సుదీర్ఘ సేవా కాలంలో ఆయన ఎన్నో కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, ప్రజల భద్రతకు తన వంతు సేవలందించారు.
ఈ వీడ్కోలు కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు పాల్గొని, శ్రీ రాంచంద్రారెడ్డి గారి సేవలను ప్రశంసిస్తూ వారి నిజాయితీ, కర్తవ్యనిష్ఠ పోలీస్ సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
సహచరులు, అధికారులు ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ, పదవి విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పోలీస్ కార్యాలయ వాతావరణం ఆత్మీయతతో నిండి, సేవలతో సంపాదించిన గౌరవానికి ప్రతీకగా ఈ వీడ్కోలు కార్యక్రమం నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *