తేది:30-01-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
జగిత్యాల జిల్లా: మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అమ్మవారిపేట గ్రామం నందు జరుగుతున్న శ్రీ మేడారం సమ్మక్క సారాలమ్మ తల్లి జాతరలో భాగంగా ఈరోజు అమ్మవారిని గుట్ట మీదనుండి సమ్మక్క తల్లిని కిందకి తీసుకుని వచ్చే సమయంలో గౌరవ సూచకంగా వరంగల్ పోలీస్ కమీషనరేట్ సెంట్రల్ జోన్ DCP దార కవిత మేడం గారు తుపాకీ తో కాల్పులు జరిపి అమ్మవారిని ఆహ్వానించడం జరిగింది. ఈకార్యక్రమం లో మడికొండ ఇన్స్పెక్టర్ శ్రీ పుల్యాల కిషన్ గారు, కాజిపేట్ MRO రాజు గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీ జలగం అనిత రంజిత్ రావు గారు, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కోడూరి భిక్షపతి గారు మరియు పాలకవర్గం పాల్గొన్నారు.