తేది:23-01-26 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: మల్యాల మండలం నూకపెల్లిలో వెలసిన విద్యాప్రదాయిని శ్రీ సరస్వతి దేవాలయంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి సుప్రభాతం, అభిషేకం, అర్చన తదితర పూజాకార్యక్రమాలు జరిపారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారు. వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే సరస్వతి దేవి అనుగ్రహంతో పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారని, జ్ఞానం, బుద్ధి, వాక్కు లభిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ క్రమంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.