తేది:22-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: బాధితుల గౌరవం, భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని మెదక్ జిల్లా పోలీసు శాఖ దేశంలోనే తొలిసారిగా ఇంటినుండే FIR నమోదు చేసే విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు.
ఈ వినూత్న విధానం ద్వారా మహిళలు, పిల్లలు, అలాగే POCSO, SC/ST అట్రాసిటీ కేసులు, శారీరక దాడులు, ర్యాగింగ్, బాల్య వివాహాలకు సంబంధించిన బాధితులు ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ నివాసం నుంచే FIR నమోదు చేసుకునే సౌకర్యం కల్పించబడిందన్నారు.
బాధితులు పోలీస్ స్టేషన్‌కు రావడంలో ఎదుర్కొనే భయం, మానసిక ఒత్తిడి, అసౌకర్యాలను తొలగించడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు పోలీస్ స్టేషన్ వాతావరణంలో ఇబ్బందులు పడకుండా న్యాయం అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపారు.
ఈ విధానం అమలుతో కేసుల నమోదు మరింత వేగవంతమవడంతో పాటు, బాధితులకు తక్షణ సహాయం మరియు న్యాయం అందే అవకాశం ఉంటుందని ఎస్పీ వివరించారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.