నేరడుగొమ్ము మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.

తేది:19-01-2026 ఖమ్మం జిల్లా TSLAWNEWS దేవరకొండ నియోజకవర్గం పులిజాల గోవర్ధన్.

ఖమ్మం జిల్లా: నేరడుగొమ్ము మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్లో 2026 -27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కొర్ర శిరీష ఒక ప్రకటనలో తెలిపారు.ఆరో తరగతిలో కొత్త ప్రవేశాలతో పాటు,ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు తెలంగాణ మోడల్ స్కూల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.దరఖాస్తుల స్వీకరణ జనవరి 28 వ తేదీ నుండి ప్రారంభమై ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 19,2026 న నిర్వహిస్తామన్నారు.ఓసీ విద్యార్థులు 200 రూపాయలు, బీసీ,ఎస్సీ,ఎస్టీ,దివ్యంగా విద్యార్థులు 125 రూపాయలు రుసుము చెల్లించాలని తెలిపారు.ఆసక్తి గల విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. మరింత సమాచారం కోసం పాఠశాల కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *