జగిత్యాల జిల్లా లో “Arrive Alive” రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం-మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు-జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్.

తేది:18- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లాలో Drunk and Drive నివారణ పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో *“Arrive Alive”* రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజు (6వ రోజు) *“Drunk and Drive – Zero Tolerance Day”* పై అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు మరియు సంబంధిత పోలీస్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, ప్రాణనష్టం, కుటుంబాలపై పడే దుష్పరిణామాల గురించి వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. మద్యం మత్తులో వాహనం నడపడం కేవలం చట్ట విరుద్ధమే కాకుండా, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్ర ప్రమాదమని స్పష్టంగా తెలియజేశారు.
Drunk and Drive కేసులపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. ఈ సందర్భంగా బ్రెత్ అనలైజర్‌లతో వాహనదారులను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.
ఎస్పీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక క్షణం మద్యం మత్తులో చేసిన నిర్లక్ష్యం జీవితాంతం పశ్చాత్తాపానికి దారితీస్తుంది అని రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం ప్రమాదాలకు మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రధాన కారణంగా మారుతోంది అని ప్రజలు స్వచ్ఛందంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించి, మద్యం సేవించినప్పుడు వాహనాలు నడపకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి అని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ చేపడుతున్న *Arrive Alive* క్యాంపెయిన్ లక్ష్యం ప్రమాదాలను తగ్గించి, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవడమేనని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరి బాధ్యతాయుత ప్రవర్తనే రోడ్డు ప్రమాదాల నివారణకు మార్గమని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *