
తేది:17- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల క్రైమ్ రిపోర్టర్ రాచమల్ల రాజేందర్.
జగిత్యాల జిల్లా: జగిత్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదురుగానే ఉన్న పరిసరాలను పట్టించుకోని సిబ్బంది, అదే దారిలో వస్తూ పోతుంటారు కానీ పట్టించుకోరు, అనే టీ ఎస్ లా న్యూస్ వార్తకు స్పందించిన మున్సిపల్ అధికారులు.
జగిత్యాల పాతబస్టాండ్ పక్కనే ఒక చెత్త బుట్టను ఏర్పాటు చేసిన నాటి నుండి దాన్ని చూడకుండా ఉన్నట్టు ఉండి, దానిలో ఉన్న చెత్తను తీయకుండా ఎన్ని ఏండ్లు అవుతుందో బుట్టను గమనిస్తే తెలుస్తుంది అనే టీ ఎస్ లా న్యూస్ వార్తకు మున్సిపల్ అధికారులు స్పందించారు. మున్సిపల్ సిబ్బంది అక్కడి చెత్త బుట్టను తొలగించి శుభ్రపరిచారు. జగిత్యాల పట్టణ వాసులు అభినందించారు.