జగిత్యాల మున్సిపల్ ముందు చెత్త బుట్ట – దాన్ని మరిచిన మున్సిపల్ సిబ్బంది – ప్రయాణికులకు ఇబ్బంది.

తేది:16- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల క్రైమ్ రిపోర్టర్ రాచమల్ల రాజేందర్

జగిత్యాల జిల్లా : జగిత్యాల మునిసిపల్ ఆఫీస్ ఎదురుగానే ఉన్న పరిసరాలను పట్టించుకోని సిబ్బంది, అదే దారిలో వస్తూ పోతుంటారు కానీ పట్టించుకోరు.జగిత్యాల పాతబస్టాండ్ పక్కనే ఒక చెత్త బుట్టను ఏర్పాటు చేసిన నాటి నుండి దాన్ని చూడకుండా ఉన్నట్టు ఉండి, దానిలో ఉన్న చెత్తను తీయకుండా ఎన్ని ఏండ్లు అవుతుందో బుట్టను గమనిస్తే తెలుస్తుంది. చెత్త బుట్టలోపలి నుండి పిచ్చిమొక్కలు పెరిగి పెద్దవైనా పట్టించుకోకుండా వదిలేసిన తీరు మున్సిపాలిటీ పనితీరును చెబుతుందని రోజు ప్రయాణించే ప్రయాణికులు అంటున్నారు. జర ఇలాంటి పబ్లిక్ ప్లేసులను సంబంధిత అధికారులు గమనించి, శుభ్రంగా ఉంచి పట్టణాన్ని అందంగా ఉంచాల్సిన బాధ్యత మున్సిపాలిటీదే కనుక పట్టణంలో ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్న గమనించి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని జగిత్యాల పట్టణ వాసులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *