అల్లాదుర్గం గ్రామ చరిత్రను పాట రూపంలో రాసిన ప్రిన్సిపాల్.

తేది:16-01-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.

సంగారెడ్డి జిల్లా: అల్లాదుర్గం గ్రామ చరిత్ర పాట రూపంలో రాసి పాడించిన ప్రిన్సిపల్ సత్తయ్య కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అల్లాదుర్గం నియోజకవర్గ సాధన సమితి అధ్యక్షులు బ్రహ్మం తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ అల్లాదుర్గం కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న సత్తయ్య బదిలీ అయి వెళ్లిన, అల్లాదుర్గంలో కొన్ని నెలలే పనిచేసిన కళాశాలలో కొత్త విధానాలతో విద్యార్థులను తీర్చిదిద్దాలని సంకల్పంతో పనిచేయడమే కాకుండా, తన రచనలతో కళాశాల, అల్లాదుర్గం గ్రామ చరిత్రను పాట రూపంలో రాసి, పాడించి సమాజానికి తెలిసే విధంగా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ రిత్య బదిలీ కావడం బాధాకరమని అన్నారు. కళాశాలకు మంచి పేరు తేవాలని విద్యార్థుల అభివృద్ధి కోసం, నిరంతరం పనిచేసిన ప్రిన్సిపల్ సత్తయ్య తన రచనలతో పాటలతో అల్లాదుర్గం గ్రామ కీర్తిని ప్రపంచానికి చాటడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *