విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు,మోడల్ పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి-గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్.

తేది:08-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం విద్యార్థులు కష్టపడి చదివితే ఉద్యోల భవిష్యత్తు ఉంటుందని మోడల్ పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. గురువారం కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు పీఎం శ్రీ మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఇ.తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ డాక్టర్ నాగరాజు తెలియదు ఎండి అప్రస్ అహ్మద్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సదానందం, రాజన్న లు ముఖ్య వక్తలుగా, మండలం లో 10వ తరగతి చదివే విద్యార్థులకు ఎంచుకుని సాధించాల్సిన లక్ష్యాలు అందుకోసం ఎంతో ప్రత్యేక శ్రద్ధ తో చదవాలని , పరీక్షలు సమీపించిన తరుణం లో సమయం వృథా చేయకుండా ఒక కచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగాలని జీవితంలో త్వరగా స్థిరపడాలని పేర్కొన్నారు. ఉదాహరణలతో, జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థిక,సామాజిక సమస్యలు, కస్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల కష్టాలు ఆటంకాలు కాకుండా చదువుపై మాత్రమే దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ దంపతులు విద్యార్థిని విద్యార్థులకు స్నాక్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *