సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా ప్రతిజ్ఞ.

తేది:2- 01-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.

సంగారెడ్డి జిల్లా: జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవం సందర్భంగా పట్టణంలోని స్థానిక శాంతినగర్ లో గల సెయింట్ ఆంథోనీస్ విద్యార్థులచేత అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి స్రవంతి రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు .రహదారి భద్రత ఒక బాధ్యత మాత్రమే కాదు ,ఇది ఒక సామాజిక కర్తవ్యం అని నమ్ముతూ నేటి బాలలే రేపటి పౌరులని ఉద్దేశంతో విద్యార్థులకు తమ వంతు భద్రత విషయాలను తెలియజేసి ,వారిని మేలుకొలిపారు. ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి 31వ తేదీ వరకు ఒక నెల రోజులు ఇలాంటి మాసోత్సవాలు జరుగుతాయని ప్రతి ఒక్కరు రహదారిపై వెళ్లేటప్పుడు రోడ్డు భద్రతను పాటించాలని కొన్ని ముఖ్యమైన విషయాలను విద్యార్థులకు తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం ఎన్నో కుటుంబాలు రోడ్లపాలు అవుతున్నాయని వారు తమ సందేశాన్ని వెలువరించారు. విద్యార్థులందరిచేత రహదారి భద్రతా ప్రతిజ్ఞ- 2026 కు సంబంధించి చేయించారు. ఇట్టి ఈ కార్యక్రమం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి , ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారి మరియు గౌరవ రవాణామరియు బి.సి సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాలను అనుసరించి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి స్రవంతి , సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీ ఈ. విజయ కుమార్ రెడ్డి అకాడమీ డైరెక్టర్ మరియు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఈ. అరుణారెడ్డి పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ ప్రదీప్ లక్కిశెట్టి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .ఇట్టి ఈ కార్యక్రమం సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థల అధినేత శ్రీ సలోమోన్ రెడ్డి గారి ఆశీస్సులతో కొనసాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *