తేది:02-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAW NEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ దంపతులను వార్డ్ సభ్యులు కోడెపాక అనిల్ లను శుక్రవారం గణపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూలం కుమారస్వామి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ లు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను,గుడ్డుతో భోజనం,ఉచిత దుస్తులు,ఉచిత పాఠ్యపుస్తకాలు,ఉచిత నోటుపుస్తకాలు పంపిణీ చేసి పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ,గ్రామంలోని ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు తన సహాయ సహకారాలను అందిస్తానని,అలాగే మౌళిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జలంధర్ శ్రీధర్ , ద్రమౌళి ,స్వర్ణలత లు పాల్గొన్నారు.