తేది:01-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా, మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం .
మెదక్ జిల్లా : నిస్వార్థ సేవకుడు అభిమాన నాయకుడు మెదక్ మున్సిపాలిటీలోని నాలుగు వార్డ్ మాజీ కౌన్సిలర్ తిమ్మన్నగారి అనిల్ కుమార్ జన్మదినం పురస్కరించుకొని తారక రామ నగర్ కాలనీ వాసులు యువకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హరిత మిత్ర అవార్డు గ్రహీత జన హృదయ నేత అన్నా అంటే నేను ఉన్నానని చెప్పే నాయకుడు మా అన్న దేవుని కృప ఉండాలని ఆకాంక్షిస్తున్నామని తెలియజేశారు. తారకరామా కాలనీలో యువకులను ప్రోత్సహిస్తూ ప్రతి పండుగను పర్వదినాలను ఆయన ముందు ఉంటే ప్రోత్సహించే తత్వం మా అన్నగారుదని ఆయనకు ఆయనే సాటిని అన్నారు. ఈ జన్మదిన వేడుకల్లో కాలనీ పెద్దలతో పాటు పలువురు పాల్గొన్నారు.