ఆదిత్య బిర్లా గ్రూపు కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ముందుకు వచ్చింది. పీఎంకేర్స్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధికి రూ.400 కోట్లను ఆదిత్య బిర్లా గ్రూపు ప్రకటించింది. అలాగే, రూ.50 కోట్లను కరోనా వైరస్ నివారణ చర్యల కోసం ఏర్పాటైన ఫిక్కీ–ఆదిత్య బిర్లా సీఎస్‌ఆర్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌కు, మరో రూ.50 కోట్లను వెంటిలేటర్లు, మాస్క్‌లు, రక్షణ పరికరాల సరఫరాకు ఖర్చు చేయనున్నట్టు గ్రూపు పేర్కొంది.