సింగరేణి కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో గళం-తక్షణ పరిష్కారానికి హామీ, సింగరేణి కార్మికుల న్యాయమే-INTUC లక్ష్యం.

తేదీ:29-12-2025 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గభవాని.

సెక్రటేరియట్,హైదరాబాద్:ఈ రోజు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో,INTUC సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారి అభ్యర్థన మేరకు,సింగరేణి కార్మికులకు సంబంధించిన మారు పేర్లు (Alias) మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలపై తక్షణమే న్యాయం చేయాలని రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సభలో గట్టిగా ప్రస్తావించారు.ఈ కీలక అంశాన్ని మంత్రి కొండా సురేఖ అసెంబ్లీలో గమనించి, సమస్యలను నోట్ చేసుకుని త్వరలోనే సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.INTUC అభ్యర్థన మేరకు సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లపై అసెంబ్లీలో గళం విప్పినందుకు గాను,INTUC పక్షాన సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, ధర్మపురి, కాంపల్లి సమ్మయ్య, త్యాగరాజన్, జెట్టి శంకర్ రావ్,జనరల్ సెక్రటరీలు వికాస్ కుమార్ యాదవ్, ఏనుగు రవీందర్ రెడ్డి,సెక్రటరీ రాపర్తి శ్రీనివాస్మరియు ఇతర INTUC నాయకులు రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
సింగరేణి కార్మికుల హక్కులు, న్యాయం కోసం INTUC నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *