హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధి పద్మావతి కాలనీలో ప్రమీల(32) అనే మహిళ కానిస్టేబుల్ మూడు అంతస్తుల బిల్డింగ్ నుండి దూకి ఆత్మహత్యయత్నం.

తేది:29-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్: ఉప్పల్ పిఎస్ పరిధి పద్మావతి కాలనీలో ప్రమీల(32) అనే మహిళ కానిస్టేబుల్ మూడు అంతస్తుల బిల్డింగ్ నుండి దూకి ఆత్మహత్యయత్నం.
కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. కానిస్టేబుల్ ప్రమీలకు, తీవ్రగాయాలైనట్టు తెలుస్తుంది. 2020 బ్యాచ్ కి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమీల నాచారం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుంది.
ఉప్పల్ పద్మావతి కాలనీలోని అపార్ట్మెంట్ లో ప్రమీల భర్త బాలాజీ నాయక్, ఇద్దరు పిల్లలతో కలసి నివాసం ఉంటుంది.
కుటుంబ సమస్యల కారణంగా కానిస్టేబుల్ ప్రమీల తను నివాసం ఉంటున్న పద్మావతి కాలనీలోని అపార్ట్మెంట్ 3 అంతస్తు నుండి కిందికి దూకి ఆత్మహత్యయత్నం చేసింది..
హుటా హుటిన ప్రమీలను ఉప్పల్ లోని సిటీ న్యూరో హాస్పిటల్ తరలించారు.
మెరుగైన చికిత్స కోసం ప్రమీలను భర్త బాలాజీ నాయక్ సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
వీరి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రవి పహార్ తండా చెందిన వారు కాదా ఉద్యోగరీత్యా ఉప్పల్ పద్మావతి కాలనీలో నివాసం ఉంటున్నారు.కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *