ప్రజావాణి కి 39 ఆర్జీలు,ప్రజావాణి సమస్యల పరిష్కార వేదికగా నిలవాలి-జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య.

తేది:29-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్న గారి కృష్ణ గౌడ్.

సంగారెడ్డి జిల్లా: ప్రజావాణి కార్యక్రమము ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలవాలని,
అందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకుసూచించారు .
కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, డి ఆర్ వో పద్మజారాణిలతో కలిసి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా అర్జీదారులు భూ సమస్యలు, ఆసరా పింఛన్లు, ఉద్యోగ కల్పన,తదితర అంశాలతో పాటు పంచాయతీరాజ్
ఇంజనిరింగ్, విద్యుత్, వ్యవసాయ, హార్టికల్చర్, విద్య, హౌసింగ్, లేబర్, పి డబ్ల్యూ డి, మిషన్ భగీరథ, మున్సిపల్, పోలిస్, మైనారిటి వెల్ఫేర్ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను కలెక్టర్ కు అందజేశారు. ఆయా వినతులను పరిశీలించి త్వరిత గతిన పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత శాఖలఅధికారులకుఆదేశించారు.ప్రజావాణి లో 39 అర్జీలు అందాయని తెలిపారు.ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమమని , ఆర్జి దారుల సమస్యలను వేగ వంతంగా పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ,డి ఆర్ ఓ పద్మజారాణి , నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, కలెక్టరేట్ ఏ ఓ, ప్రజలు, పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *