
తేది:29-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: సోమవారం జగిత్యాల జిల్లా నూతన వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిగా డా.సుజాత బాధ్యతలు స్వీకరించారు. డా.సుజాత హైదరాబాద్ నల్లకుంట లోని ప్రభుత్వ కుష్టు వ్యాధి క్లినిక్ మరియు శిక్షణా కేంద్రంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. జగిత్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా ఆకుల శ్రీనివాస్ అకాల మరణం వల్ల, తెలంగాణ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ వెల్ఫేర్ డా. రవీందర్ నాయక్ ఈ నెల 27 న ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య సిబ్బంది నూతన డిఎంహెచ్వో గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సుజాతకు పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత మాట్లాడుతూ వైద్య సిబ్బంది మెరుగైన సేవలు అందించి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, ఆఫీస్ సూపర్టెండెంట్ నర్సింగరాజ్, ఏ ఏం ఓ సత్యనారాయణ, ఎన్ హెచ్ ఎం ,డి పి ఓ రవీందర్, హెచ్ ఈ ఓ లు రాం కుమార్, శ్రీధర్, రాజేశం, హెల్త్ ఎడ్యుకేటర్స్ కటకం భూమేశ్వర్, తరాల శంకర్, సూపర్వైజర్లు శ్రీనివాస్, శ్యామ్, కుతుబుద్దీన్ ,తదితరులు పాల్గొన్నారు