
తేది:29-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా, హవేలి ఘణపూర్ రిపోర్టర్ తలారి బాలయ్య.
మెదక్ జిల్లా: హవెలిఘనపూర్ మండలం సర్ధన గ్రామ మాజీ సర్పంచ్ కవిత భర్త రేషన్ డీలర్ వెంకట్ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం.పద్మాదేవేందర్ రెడ్డి సోమవారం సర్ధన గ్రామానికి చేరుకొని వెంకట్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వెంకట్ భర్త కవితను పరామర్శించి ఓదార్చారు. మనోధైర్యాన్ని కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థించారు.అనారోగ్యంతో వెంకట్ మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు.ఈ సందర్భంగా రూ. 10 వేలు ఆర్థిక సాయం చేశారు.వీరి వెంట గ్రామ సర్పంచ్ వినోద సతీష్,మాజీ వైస్ ఎంపీపీ రాధా కిషన్ యాదవ్,గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాపు కిషన్,వార్డ్ మెంబర్ రమేష్, హవెలిఘనపూర్ సర్పంచ్ మ్యాకల. సాయిలు,నాయకులు సతీష్ రావు రాజేశ్వరరావు, లక్ష్మణ్, సంతప్ప, భువనేశ్వర్,రంజిత్ యాదవ్, దుర్గేష్,శ్రీనివాస్ చారి తదితరులు ఉన్నారు.