సింగరేణి కార్మికుల హక్కుల కోసం ఐఎన్టీయూసీ నిరంతర పోరాటం-దిగజారుడు ప్రచారాలు ఖండనీయం.

 

తేదీ: 29-12-2025 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.

హైదరాబాద్ :కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి. జనక్ ప్రసాద్ నాయకత్వంలో సింగరేణిలో ఐఎన్టీయూసీ చేపడుతున్న పోరాటాలను ఓర్వలేక కొంతమంది చేస్తున్న దిగజారుడు విమర్శలు సిగ్గుచేటు.కార్మికుల ఎల్లనాటి కలైన సొంతింటి కలను నిజం చేయడానికి, ఏడాది పన్నెండు నెలలు పనిచేస్తే నాలుగు నెలల జీతం ఆదాయపన్నుకే వెళ్లిపోతున్న పరిస్థితుల్లో కనీసం పెర్క్స్‌పై అయినా ఆదాయపన్ను మినహాయింపు కల్పించి కార్మికులకు ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు ఐఎన్టీయూసీ శ్రమిస్తోంది. అలాగే 3,700 విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉండటంతో డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌పీని అధికారులకు చెల్లించేలా ప్రభుత్వం–యాజమాన్యంతో చర్చలు, మారుపేర్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్న కార్మికులకు మార్పు అవకాశం కల్పించేందుకు కృషి, మెడికల్ బోర్డులో జరుగుతున్న అన్యాయాలను రూపుమాపే చర్యలు ఇవన్నీ ఐఎన్టీయూసీ కార్యాచరణలో భాగమే.సింగరేణి భవిష్యత్తును కాపాడేందుకు కొత్త గనుల సాధన, డిస్మిస్డ్ కార్మికులకు మరో అవకాశం కల్పించాలనే దిశగా యాజమాన్యాన్ని ఒప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ, ఐఎన్టీయూసీకి మద్దతుగా నిలవాల్సిన కొన్ని సంఘాలు “అమ్మ పెట్టదు అడక్కు తిననివ్వదు” అన్నట్లుగా తప్పుడు ప్రచారాలు చేయడం కార్మిక వర్గాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. శ్రీ జనక్ ప్రసాద్ నాయకత్వంలో సాధించిన ముఖ్య విజయాలు ఇవి:
డిపెండెంట్ ఉద్యోగుల వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంపు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వేలంపాటల్లో పాల్గొని సంస్థను రక్షించుకునేలా ప్రభుత్వాన్ని ఒప్పించడం, కాంట్రాక్టు కార్మికులకు దేశంలోనే ప్రత్యేకంగా లాభాల బోనస్,ప్రమాదంలో మృతి చెందితే కుటుంబాలకు రూ.1.20 కోట్లు ప్రమాద బీమా, కాంట్రాక్టు కార్మికులకు కూడా రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఇన్ని సాధించినప్పటికీ ఈర్ష్య, అసూయతో ఐఎన్టీయూసీని బదనాం చేయాలనే లక్ష్యంతో కొన్ని సంఘాలు దిగజారి మాట్లాడడం గర్హనీయం. గుర్తింపు సంఘం వైఫల్యం వల్ల కొనసాగుతున్న మెడికల్ బోర్డు వైఫల్యం, 150 మస్టర్ల సర్క్యులర్, కొత్త బదిలీ విధానం వంటి కార్మిక వ్యతిరేక చర్యలపై చేతనైతే ఐఎన్టీయూసీ పోరాటాలకు కలిసి రావాలి.కొత్త బొగ్గు బ్లాకుల సాధన, విజిలెన్స్ కేసుల పరిష్కారం, ఉద్యోగాల సృష్టి, కార్మికులపై జరుగుతున్న అన్యాయాల నిర్మూలన ఇవే ఐఎన్టీయూసీ లక్ష్యాలు. సెమినార్ హాల్లో కూర్చుని కార్మిక సమస్యలపై చర్చించడం తప్పు కాదని, సి& ఎమ్.డి తో గానీ ఇతర అధికారులతో గానీ సమావేశం జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం అనైతికమని స్పష్టం చేస్తున్నాం. అబద్ధ ప్రచారాలను నమ్మే స్థితిలో కార్మిక వర్గం లేదు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఐఎన్టీయూసీ వాదం ఒక్కటే కార్మికుల సంక్షేమం, కార్మికుల హక్కుల పరిరక్షణ. ఇప్పటికైనా ఇలాంటి దిగజారుడు ప్రచారాలు మానుకోకపోతే, కార్మికులే తగిన గుణపాఠం చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *