లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు మార్చి నెల జీతం సగమే అందనుంది. రెండు వారాలుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ఆదాయం ఆగి పోయింది. ఫలితంగా జీతాల చెల్లింపు కష్టతరమైంది. వైద్య సిబ్బంది, పోలీసు శాఖలు మినహా మిగతా అన్ని శాఖల ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఈ నెల సగం జీతమే చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. మిగతా సగం చెల్లించేందుకు కూడా నిధులు లేకపోవడంతో వాటిని సమకూర్చేందుకు అధికారులు నానా పాట్లు పడుతున్నారు. మార్చి నెల తొలి రెండు వారాలకు సంబంధించిన టికెట్ వసూళ్లలో కొంత మొత్తం అందుబాటులో ఉంది. అధికారులు ఏదో ఒక రూపంగా జీతాలు సర్దుబాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఉద్యోగులకు మొత్తం జీతం చెల్లించాలని కార్మిక సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.