గూడూరు సర్పంచ్ దంపతులకు సన్మానం.

తేది:28-12-2025, జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.

జనగామ జిల్లా: గూడూరు గ్రామానికి చెందిన పద్మశాలి కులం నుండి ఇటీవల సర్పంచ్ గా ఎన్నికైన మాచర్ల స్వరూప పుల్లయ్య దంపతులను పద్మశాలి కుల సంఘం సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది రెండవసారి పద్మశాలి కులం నుండి సర్పంచ్ గా అవకాశం కల్పించడం, అదేవిధంగా ఒకే కుటుంబానికి ఈ అవకాశం రెండుసార్లు రావడం ఆనంద దాయకమని పద్మశాలి కుల సంఘ సభ్యులు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు .ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాచర్ల స్వరూప మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు కుల సంఘాలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామనీ, తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వ పథకాలను సరియైన లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. తమ కుటుంబానికి ప్రజలకు సేవ చేసేఅవకాశం కల్పించినందుకు పద్మశాలి కుల సంఘ సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల సంఘ పెద్దలు మడత హరిచంద్రం, వైట్ల రామ్మూర్తి, దుస్స వెంకటేశ్వర్లు, ఐరోండ్ల మార్కండేయ, చింతకింది శ్రీనివాసులు, కోమటి సోమరాజు, మాచర్ల గౌరమ్మ వైట్ల లక్ష్మి, వైట్ల విజయ, మాచర్ల విజయలక్ష్మి, వైట్ల అశోక్, మడత రాజు, మడత ఎలేందర్, దుస్స నవీన్, దుస్స రాకేష్, మాచర్ల ఉపేందర్, మాచర్ల సమ్మయ్య, మాచర్ల సదానందం, మడత రవీంద్రుడు దుస్స నరేష్ మడత యాదగిరి మాచర్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *