తేదీ:28-12-2025,సంగారెడ్డి జిల్లా,TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్.
సంగారెడ్డి జిల్లా: కార్మిక రంగానికి, బడుగు బలహీనవర్గాలకు మాజీ మంత్రి, కార్మిక నాయకులు పి. జనార్దన్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పిజెఆర్ 18 వ వర్ధంతి పురస్కరించుకుని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని.. పీజెఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కార్మిక రంగ సంక్షేమం కోసం వారి హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి పీజెఆర్ అని కొనియాడారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలోని కార్మికుల హక్కుల పరిరక్షణలో పిజెఆర్ పాత్ర మరువలేనిదని అన్నారు. నిరంతరం బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం తపించిన పి జి ఆర్ ఆశయాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. అనంతరం బిఆర్టియు కిర్బీ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్.మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్,సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, కిర్బీ కార్మిక సంఘం నాయకులు మాధవరావు, యాదగిరి,వెంకటేష్, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.